కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత

May 15,2024 13:01 #Jyotiraditya Scindia, #Mother Dies

న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా సెప్సిస్‌తోపాటు పాటు న్యుమోనియాతో బాధపడుతున్నారు. గతకొద్దిరోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స నందిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి 9.28 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, మధ్యప్రదేవ్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విడి శర్మ మాధవి రాజే సింధియా మృతికి సంతాపం తెలిపారు. జ్యోతిరాదిత్య సింధియా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

➡️