Karnataka : బస్సు బోల్తా పడి 60 మంది విద్యార్థులకు గాయాలు

Nov 28,2024 13:56 #bus accident, #Karnataka

బెంగళూరు : విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళుతున్న ఓ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 60 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు గురువారం ఉదయం హంసి, విజయపురలకు విహారయాత్రకు తీసుకెళ్లారు. బస్సు కొప్పాల్‌లోని గంగావతి సమీపానికి చేరుకోగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులతోపాటు ఏడుగురు ఉపాధ్యాయులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️