గోస్మగ్లర్లను కాల్చిపారేయండి : కర్ణాటక మంత్రి అనుచిత వ్యాఖ్యలు

బెంగళూరు : గో స్మగ్లర్లను బహిరంగంగా కాల్చిపారేయాలంటూ కర్ణాటక మంత్రి మంకాల్‌ వైద్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర కన్నడ జిల్లాలో గోవుల దొంగతనం కేసులు పెరిగిపోయాయని, ఇకపై జిల్లాలో ఇటువంటి కార్యకలాపాలు కొనసాగనివ్వమని అన్నారు. గోవుల రక్షణకు, వాటిని సంరక్షించేవారి ప్రయోజనాల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని నడిరోడ్డుపై బహిరంగంగా కాల్చిపారేయాలని ఆదేశిస్తానని అన్నారు.

జిల్లాలో తగిన ఉద్యోగాలు ఉన్నాయని, ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించబోమని అన్నారు. కొన్నేళ్లుగా గోవుల దొంగతనం జరుగుతోందని, వీటిని ఆపాలని ఎస్‌పిని ఆదేశించానని అన్నారు. చిన్నప్పటి నుండి ఆవుపాలు తాగుతూ పెరిగామని, గోవులను పూజించాలని, వాటిని సంరక్షించాలని అన్నారు.

➡️