Karnataka : కర్ణాటకలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

Jan 7,2025 13:35 #Karnataka, #road accident, #tumkur

తుంకూర్‌ (కర్ణాటక) : కర్ణాటక తుంకూర్‌లో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బైకర్లు మృతి చెందారు. ఓబాలాపూర్‌ గేట్‌ సమీపంలో బైక్‌ను ట్రాక్టర్‌ ట్రయిలర్‌ ఢకొీనడంతో బైక్‌పై వెళుతున్న ముగ్గురు మృతి చెందారు. మృతులను మధుగిరి తాలూకాలోని గొందిహళ్లి గ్రామానికి చెందిన మొహ్మద్‌ ఆసిఫ్‌ (12), ముంతాజ్‌ (38), షాకీర్‌ హుస్సేన్‌ (48)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కోరా పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి పోలీస్‌ సూపరింటెండెంట్‌ అశోక్‌ వెంకట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ చేరుకున్నారు. కేసు దర్యాప్తును ప్రారంభిస్తామని వారు మీడియాకు వెల్లడించారు.

➡️