కర్ణాటక ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవ దహానం

Mar 9,2025 12:38 #2 death, #Karnataka, #road acidnet

బెంగళూరు : చింతామణి దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొని భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి తిరుపతి వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

➡️