Kejriwal : కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు..  కేజ్రీవాల్‌ పునరుద్ఘాటన

Dec 11,2024 23:25 #Assembly Elections, #Delhi, #Kejriwal

న్యూఢిల్లీ : ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమాద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోమారు చెప్పారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ తన సొంత బలంతోనే బరిలోకి దిగుతుందని అని పునరుద్ఘాటించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆప్‌ పార్టీ రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

➡️