Yamuna row : ఎన్నికల కమిషన్‌ ఎదుట కేజ్రీవాల్‌ హాజరు

న్యూఢిల్లీ :  ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల కమిషన్‌ ఎదుట శుక్రవారం హాజరయ్యారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆయన వెంట ఉన్నారు. హర్యానా ప్రభుత్వం యమునా నదిలోకి విషపూరిత నీటిని విడుదల చేస్తోందంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించేందుకు గళం విప్పానని, అందుకే తనకు ఇసి నోటీసులు పంపిందని కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️