Kejriwal : ఎన్నికల కమిషనర్ బిజెపికి లొంగిపోయారు

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5వ తేదీన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని బిజెపి ఉల్లంఘించినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ పదవీ విరమణ తర్వాత అపాయింట్‌మెంట్‌ కోసం బిజెపికి లొంగిపోయారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతీయ జనతాపార్టీ ముందు ఎన్నికల సంఘం లొంగిపోయిన తీరు చూస్తుంటే.. ఎన్నికల సంఘం ఉనికిలో లేనట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా రాజీవ్‌ కుమార్‌జీ తీరు చూస్తే ప్రజలకు ఎన్నో ఆలోచనలు రేకెత్తుతున్నాయి. అసలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎవరు? ఆయన ఈ నెలలోనే రిటైర్‌మెంట్‌ అవుతున్నారా? ఆయన రిటైర్మెంట్‌ అయిన తర్వాత బిజెపి ఏ పోస్టు ఆఫర్‌ చేస్తుంది? బహుశా ఎన్నికలు బిజెపికి అనుకూలంగా నిర్వహిస్తుందున్నందుకు ఆపార్టీ ఆయనకు గవర్నర్‌ పదవి ఆఫర్‌ చేయొచ్చు? లేక రాష్ట్రపతి పదవైనా ఏదైనా కావొచ్చు. రాజీవ్‌ జీకి బిజెపి రిటైర్మెంట్‌ తర్వాత కూడా పోస్టు ఇస్తుంది’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ జీకి చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీరు ఆ పదవిలో ఉన్నందుకు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. పదవిపై కోరికను వదులుకోండి. మీరు కెరీర్‌లో చివరిలో ఉన్నారు. దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయవద్దు అని కేజ్రీవాల్‌ వేడుకున్నారు.

➡️