Kerala: విపత్తుల అంచనాకు పటిష్ట యంత్రాంగం అవసరం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
తిరువనంతపురం : ప్రకృతి విపత్తులపై ఖచ్చితమైన అంచనాకుదేశంలో పటిష్టమైన యంత్రాంగం అవసరమనికేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విజయన్‌ ప్రసంగిస్తూ ప్రకృత్తి విపత్తులను ఖచ్చితంగా అంచనా వేయడంలో దేశం ఎదుర్కొంటును సవాళ్లను ఆయన ప్రస్తావించారు. శాస్త్రీయ పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో గణనీయమైన పురోగతి ఉనుప్పటికీ మానవ జీవితాలు, ఆస్తులను రక్షించడంలో కీలకమైన ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా అంచనా వేయడానికి భారత్‌ కష్టపడుతోందనివిజయన్‌ అనాురు. 21వ శతాబ్దంలో కూడా ప్రకృతి విపత్తుల గురించి ఖచ్చితమైన హెచ్చరికలు అందించే పటిష్టమైన యంత్రాంగం దేశంలో లేదనిపినరయి విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ హెచ్చరికల కంటే ఖచ్చితమైన అంచనాలతో మాత్రమే విపత్తులను సమర్థవంతంగా నిరోధించవచ్చునని ప్రపంచ అనుభవం తెలిపిందనిచెప్పారు. కొండచరియలు విరిగిపడి వయనాడ్‌లో విధ్వంసం చోటుచేసుకును నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

చీకటి యుగంలోకి నెట్టే కుట్ర..
అలాగే, మత విభజన అనే ఆయుధంతో దేశానిు మళ్లీ చీకటి యుగంలోకి నెట్టడానికి కొనిు విచ్ఛిను శక్తులు కుట్ర పనుుతునాుయనివిజయన్‌ విమర్శించారు. ఈ యతాులతో లౌకికవాదానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలనిఆయన తెలిపారు. అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, తయారీ, పరిశ్రమలు వంటి రంగాల్లో రాణిస్తూ దేశం కొత్త యుగంలోకి మారుతును సమయంలోనూ కుల, మత విభజనతో దేశానిు తిరిగి చీకటి కాలంలోకి నెట్టడానికి కొనిు శక్తులు ప్రయతిుస్తునాుయనాురు. వీటితో లౌకికవాదానికి ప్రమాదం పొంచివునుందున ప్రజలంతా జాగ్రత్తగా స్పందించాల్సిన అవసరం ఉందనాురు. శాస్త్రీయ స్పృహ క్షీణించడం మతవాద ధోరణులకుచోటు కల్పిస్తుందని, ఇది సమైక్యత, సమగ్రతను దెబ్బతీస్తుందనివిజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అభివఅద్ధిలో సమగ్ర దృక్పథం, సహాజ వనరులపై అనిు ప్రాంతాలు, తరగతులకుసమాన హక్కులను కల్పించాలనివిజయన్‌ పిలుపునిచ్చారు. ప్రాంతీయ అసమతుల్యత భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అణగదొక్కే ప్రమాదం ఉందనాురు. తిరువనంతపురం సెంట్రల్‌ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర పారామిలటరీ బలగాలు, కేరళ పోలీసులు, తమిళనాడు పోలీసులు, కేరళ ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సర్వీసెస్‌, కేరళ ఎక్సైజ్‌, జైళ్లు, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో సహా అనేక విభాగాలకుచెందిన బెటాలియన్లు కవాతు నిర్వహించాయి. అలాగే ఈ వేడకల్లో వివిధ పోలీసు పతకాలను బహుకరించారు.

➡️