సంభాల్ : కర్నాటకలో కిష్కింధలో ప్రారంభమైన రథయాత్ర తాజాగా సంభాల్‌లోని పురాతన కార్తికేయ మహాదేవ్ ఆలయానికి చేరుకున్నది. ఈ సందర్భంగా గోవిందానంద సరస్వతి మహరాజ్ భారీ పోలీసు బలగాల సమక్షంలో దర్శనం, పూజలు చేశారు. అయితే రథయాత్ర ముస్లిం ప్రాబల్యం ఉన్న ఖగ్గు సరారు ప్రాంతం గుండా సాగింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన సర్కిల్ ఇన్స్‌పెక్టర్ (సీఓ) అనుజ్ చౌదరే రథయాత్ర ముందు చేతిలో గద పట్టుకుని నడవడం చర్చనీయాంశమైంది. చేతిలో గద్దె పట్టుకుని నడవడంపై అడిగిన ప్రశ్నకు, రథయాత్ర ముందు నిలబడి ఉండమని గురూజీ తనకు సూచించారని చెప్పారు. యూనిఫాంలో గద పట్టుకోవడం పాపం కాదు. సనాతన్‌తో పాటు ఇతర వ్యక్తులందరికీ భద్రతను అందించడానికి మేం ఇక్కడ ఉన్నాం. అంతా ప్రశాంతంగా పూర్తయిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు.
