కోల్‌కతా : 11 గంటల సోదాల అనంతరం ఆర్‌జికర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ నివాసం నుండి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసానికి చేరుకున్న సిబిఐ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. కీలకమైన ఆధారాలు లభించాయా అన్న ప్రశ్నకు.. ఓ సిబిఐ అధికారి స్పందిస్తూ.. ‘‘ చాలా చాలా ’’ అని బయటికి వెళ్తూ చెప్పారు.
మాజీ మెడికల్ సూపరింటెండెంట్ సంజయ్ వశిష్ట్‌తో పాటు కోల్‌కతాలో, బయట ఉన్న మరో 13 మంది నివాసాల్లోనూ సోమవారం సోదాలు చేపట్టినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. రోగుల భద్రత మరియు నిర్వహణ కోసం అవసరమైన పరికరాలను సరఫరా చేసే వారి నివాసాలు, కార్యాలయాల్లోనూ సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం సోదాలు జరిపింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు
కోల్‌కతా అభయ కేసులో ఆర్‌జి కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సందీప్ ఘోష్‌తో పాటు కోల్‌కతాకు చెందిన మూడు ప్రైవేట్ సంస్థల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. మధ్య జోర్హాట్, బనిపూర్, హౌరాల్లోని మా తారా ట్రేడర్స్, బెల్గాచియా, కమాలౌహాల్లోని ఎషాన్ కేఫాల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది.