న్యూఢిల్లీ : అంతర్జాతీయ పోలీసు సహాయం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అభివృద్ధి చేసిన ‘భారత్ పోల్’ పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఇంటర్ పోల్’లోని 195 సభ్య దేశాల నుంచి కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తమ కేసులకు సంబంధించిన సమచారాన్ని పంచుకోవడానికి, పొందడానికి ‘భారత్ పోల్’ ఉపయోగపడుతుందని చెప్పారు. దేశం నుంచి పరారైన నైరస్తులను పట్టుకోవడానికి, వారిని కోర్టుల్లో హజరుపర్చడానికి సహకరిస్తుందని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/bharat-pol.jpg)