అయోధ్య ‘హత్యచార’ బాధిత కుటుంబానికి వామపక్షాల పరామర్శ

Feb 5,2025 06:42 #ayodya, #cpm leaders

లక్నో : అయోధ్య జిల్లాలో అత్యాచారానికి, తరువాత హత్యకు గురైన దళిత మహిళ కుటుంబ సభ్యులను వామపక్ష పార్టీల ప్రతినిధి బృందం సోమవారం పరామర్శించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం వ్యక్తం చేసింది. న్యాయం కోసం జరుపుతున్న పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబానికి కనీసం రూ. 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ బృందంలో ఎంసిపి జిల్లా మంత్రి అశోక్‌ యాదవ్‌, బికెపి జిల్లా కార్యదర్శి అశోక్‌ కుమార్‌ తివారీ, బికెపి జిల్లా ఇన్‌ఛార్జ్‌ అతిక్‌ అహ్మద్‌, కిసాన్‌ సభ జిల్లా అధ్యక్షులు రామ్‌ యాదవ్‌, సంయుక్త కార్యదర్శి వినోద్‌ సింగ్‌ ఉన్నారు. అయోధ్య జిల్లాలోని షహ్నావా గ్రామంలో ఇటీవల ఒక దళిత మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు.

➡️