న్యూఢిల్లీ : తమ నోటీసుపై స్పందించనందున పలువురు ఆప్ నేతలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) త్వరలో చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ముఖేష్ అహ్లావత్, సంజయ్ సింగ్ సహా పలువురు ఆప్‌నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎసిబి ఢిల్లీ పోలీసులకు లేఖ రాయనున్నట్లు సమాచారం.
ఈ నెల 7న ఆప్ నేతలను వేటాడేందుకు బిజెపి యత్నిస్తోందన్న వ్యాఖ్యలపై ఆప్ నేత ముఖేష్ అహ్లావత్‌కు ఎసిబి నోటీసులు జారీ చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు లంచాలు ఇస్తున్నారనే ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు కూడా ఎసిబి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.