సిపిఎం అభ్యర్థిని గెలిపించండి : బృందాకరత్‌

May 17,2024 00:42 #brundakarath, #cpm

హుగ్లీ : ప్రజల వాణిని పార్లమెంట్‌లో వినిపించి, వారి సమస్యలపై పోరాడేందుకు సిపిఎం అభ్యర్థి మొన్‌దీప్‌ ఘోష్‌ను గెలిపించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ పిలుపునిచ్చారు. హుగ్లీలోని జీరత్‌ బస్టాండ్‌ మైదానంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అవినీతి టిఎంసిని, మతతత్వ బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా నాయకులు అటనుఘోష్‌ అధ్యక్షతన జరిగిన సభలో సయరూప్‌ ఘోష్‌, అధిక సంఖ్యలో ఉపాధి హామీ కార్మికులు, రైతులు, అసంఘటితరంగ కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.

➡️