న్యూఢిల్లీ : లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసోడియాను కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా.. జులై 22 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు ఇడి, సిబిఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఆదేశించారు. లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి ఇడి, సిబిఐ నమోదు చేసిన అవినీతి, మనీలాండరింగ్ కేసులలో దాఖలైన బెయిల్ పిటిషన్‌లను కోర్టు ఏప్రిల్ 30న కొట్టివేసిన సంగతి తెలిసిందే.
