Waqf Bill : జాయింట్‌ పార్లమెంటరీ ప్యానెల్‌కు 21 మంది సభ్యులు

న్యూఢిల్లీ :   వక్ఫ్‌ (సవరణ) బిల్లును పరిశీలించే జాయింట్ పార్లమెంటరీ ప్యానెల్  21మంది సభ్యులను భాగం చేస్తూ లోక్‌సభ శుక్రవారం ఉదయం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కమిటీలో రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు ఎంపికయ్యారు. తదుపరి పార్లమెంట్‌ సెషన్  మొదటి వారంలో కమిటీ నివేదికను సమర్పించాల్సి వుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు వక్ఫ్‌ (సవరణ) బిల్లును లోక్‌సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులతో కూడిన జాయింట్‌ పార్లమెంటరీ  ప్యానెల్‌కు పంపుతున్నట్లు తీర్మానం చేశారు.

ప్రతిపక్షాల నిరసనల మధ్య గురువారం కిరణ్‌ రిజిజు వక్ఫ్‌ బోర్డ్‌ సవరణ బిల్లు, ముస్లిం మ్యాన్‌ వక్ఫ్‌ (రీఫిల్‌) బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపనున్నట్లు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

➡️