Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌

May 13,2024 15:44 #Lok Sabha elections, #Phase 4

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల 4వదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్‌సభ స్థానాల్లోని ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మొత్తంగా 1,717 అభ్యర్థులు ఈ దశలో పోటీపడుతున్నారు.

ఎపిలోని 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, యుపిలోని 13, బీహార్‌లోని 5, జార్ఖండ్‌, ఒడిశా 4, మధ్యప్రదేశ్‌ 8, మహారాష్ట్ర 11, పశ్చిమబెంగాల్‌ 8, జమ్ముకాశ్మీర్‌లోని ఒక స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది.

శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి కూడా ఓటింగ్‌ జరుగుతోంది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకాశ్మీర్‌ వి అనంతరం జమ్ముకాశ్మీర్‌లోని ఇవి మొదటి ఎన్నికలు కావడం గమనార్హం.

ఎపిలోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఒకేదశలో పోలింగ్‌ జరుగుతోంది.

➡️