Lok Sabha polls : 11గంటల సమయానికి 24 శాతం ఓటింగ్‌ నమోదు

May 13,2024 13:42 #Lok Sabha polls, #Phase 4

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది. ఎపిలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఎపిలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో పోలింగ్‌ను బహిష్కరించారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశాలోని పలు బూత్‌లలో ఇవిఎంలు పనిచేయడం లేదని నివేదికలు వెలువడ్డాయి. 11 గంటల సమయానికి జమ్ముకాశ్మీర్‌లో అతి తక్కువ ఓటింగ్‌ శాతం 14.94 శాతం నమోదు కాగా, పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 32.78 శాతం ఓటింగ్‌ నమోదైంది.

➡️