న్యూఢిల్లీ : త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో.. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, సన్నాహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, హర్యానా ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. హర్యానాలో మరోసారి బిజెపినే అధికారంలోకి రావడంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత నిరాశ ఎదురైంది. దీంతో మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీ దృష్టి సారించింది. ఈసారి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీనే అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటేల్, సిఎల్‌పి నేత బాలాసాహేబ్ థోరట్, ఎల్‌ఓపి విజరు వాడెట్టి వార్, ఎంఆర్‌సిసి అధ్యక్షురాలు వర్షా గౌక్వాడ్ తదితరులు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో జరగబోయే సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
Maharashtra Assembly polls : నేడు ఢిల్లీకి వెళ్లనున్న మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు
