శబరిమలలో మకరజ్యోతి దర్శనం..

Jan 14,2025 20:12 #sabarimala

శబరిమల: శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి యాత్రికులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప మాలదారులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️