వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ సాధ్యం కాదు : మల్లికార్జున ఖర్గే

బెంగళూరు : ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని కచ్చితంగా అమలుచేసి తీరుతాం అని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెబుతున్నారు. కానీ అది సాధ్యం కాదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ ఏం మాట్లాడుతున్నారు. ఆయన చెప్పేది చేయలేరు. ఎందుకంటే ఆ విధానాన్ని అమలు చేయడానికి పార్లమెంటులో ఆయన అందరి ఆమోదం తీసుకోవాలి. అప్పుడే అది జరుగుతుంది. అది ఆయన చేయలేరు. అది అసాధ్యం. అందుకే ఒక దేశం, ఒక ఎన్నిక కూడా అసాధ్యమే’ అని ఆయన అన్నారు.
కాగా, గురువారం గుజరాత్‌లో కెవాడియాలో జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేము వన్‌ నేషన్‌, వన ఎలక్షన్‌ కోసం పని చేస్తున్నాము’ అని ఆయన అన్నారు. మోడీ వ్యాఖ్యలపై ఖర్గే మండిపడ్డారు. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

➡️