Waqf Act : పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్‌ చట్టాన్ని అమలు చేయం : మమతా బెనర్జీ

Apr 12,2025 15:49 #Mamata Banerjee, #Waqf Act

కోల్‌కతా : వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో నిన్న, ఈరోజు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వక్ఫ్‌ చట్టాన్ని పశ్చిమబెంగాల్‌లో అమలు చేయమని చెప్పారు. వక్ఫ్‌ చట్టాన్ని కేంద్రమే రూపొందించిందని, దీనికి సమాధానాలు కేంద్రమే ఇస్తుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మత విద్వేషాలకు పాల్పడవద్దని, ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, రాజకీయాల కోసం అల్లర్లు సృష్టించవద్దని, అందరూ శాంతియుతంగా ఉండాలని, ఆ రాష్ట్ర ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
కాగా, శుక్రవారం ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మాల్దా, ముర్షీదాబాద్‌, సౌత్‌ పరగనాస్‌, హుగ్లీ జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులు రైళ్లపై రాళ్లు రువ్వారు, పలు వాహనాలకు నిప్పుపెట్టారు.

 

➡️