ముంబయి : పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ ఎన్‌సిపి (ఎస్‌పి) పార్టీ నేత శరద్‌పవార్‌తో శుక్రవారం సాయంత్రం ముంబైలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇరువురు నేతలు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పవార్ కుమార్తె సుప్రియా సూలె కూడా పాల్గొన్నారు.
కాగా, ఈరోజు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి హాజరయ్యేందుకు మమతా బెనర్జీ ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే శరద్‌పవార్‌తోనూ, ఉద్దవ్‌ఠాక్రే, అఖిలేష్ యాదవ్‌లోతనూ భేటీ కానున్నట్లు ఆమె మీడియాకు వెల్లడించారు.
