యూపీలో దారుణం : కుటుంబాన్ని హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య

May 11,2024 16:58 #6 death, #Hatya, #Uttar Pradesh

సీతాపూర్‌ : డ్రగ్స్‌, మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేసి.. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని సీతాపూర్‌ జిల్లా పల్హాపూర్‌లో చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అనురాగ్‌ సింగ్‌ (45) మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. దీంతో అతగాడిని డీ-అడిక్షన్‌ సెంటర్‌కి పంపాలని కుటుంబం భావించింది. కానీ విషయంలో సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. తొలుత 65 ఏళ్ల తల్లి సావిత్రిని కాల్చి చంపాడు, తరువాత భార్య ప్రియాంక (40)ని సుత్తితో కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగలేదు ముగ్గురు పిల్లలను (కుమార్తె అశ్విని (12), చిన్న కుమార్తె అశ్విని (10)లను హత్య చేశాడు.ఆ తర్వాత అనురాగ్‌ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు

➡️