Manmohan Singh – మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ యాత్ర మొదలై నిగంబోథ్‌ ఘాట్‌ వరకూ కొనసాగనుంది. ఈరోజు ఉదయం 11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్‌ సింగ్‌ గురువారం సాయంత్రం కన్నుమూసిన సంగతి విదితమే. శుక్రవారం ఆయన నివాసంలో మాజీ ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్‌ భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలు మన్మోహన్‌ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు.

కాసేపట్లో మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు

➡️