న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్ల రూపాయలకు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. చోక్సీని పట్టుకునేందుకు ఏడేళ్లుగా భారత దర్యాప్తు ఎజెన్సీలు ప్రయత్ని స్తున్నాయి. ఈ ఆర్థిక నేరగాడి కదలికలపై నిఘా పెడుతూ వచ్చిన అధికారులు ఎట్టకేలకు బెల్జియంలో అరెస్ట్ అయ్యేలా చేశారు. స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు చోక్సీ ప్రణాళిక వేస్తున్న సమయంలో ఏప్రిల్ 12న బెల్జియం పోలీసులు పట్టుకున్నారు. గీతాంజలి గ్రూప్ యజమాని అయిన చోక్సీ తన మేనల్లుడు నీరవ్ మోడి, ఆయన సోదరుడు నిషాల్ మోడితో కలిసి పిఎన్‌బికి రూ.13,500వేల కోట్ల పైగా కన్నం పెట్టారు. మోసం బయటపడటానికి ముందు 2018లో భారత్‌ను విడిచి పారిపోయారు. చోక్సీ అరెస్ట్ భారత్‌కు పెద్ద విజయం అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే పేదల డబ్బును దొచుకున్న చోక్సిని అరెస్ట్ చేసిందన్నారు.
