mining tragedy : సిట్‌ విచారణ జరపాలి : ప్రధానికి కాంగ్రెస్‌ ఎంపి గౌరవ్‌ గగోరు లేఖ

Jan 11,2025 17:50 #Congress MP, #Gaurav Gogoi

గౌహతి : అస్సాంలోని దిమా హసావో జిల్లాలోని బొగ్గు గనిలో మంగళవారం తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటికి ఆరుగురు మృతదేహాలను రెస్క్యూ బృందం వెలికి తీశారు. ఈ క్రమంలో ఈ దుర్ఘటన జరగడానికి ప్రధాన కారణం అక్రమ మైనింగ్‌ అని కాంగ్రెస్‌ ఎంపి గౌరవ్‌ గగోరు ఆరోపించారు. అస్సాం రాష్ట్రంలో బలహీనతమైన చట్టాల అమలు, స్థానిక సంక్లిష్టత కారణంగా అక్రమ మైనింగ్‌ అదుపు లేకుండా కొనసాగుతోందని గగోరు ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. బొగ్గు గని విషాద ఘటనపై సిట్‌ విచారణ జరిపించాలని గగోరు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. భద్రత, అవినీతి, పర్యావరణ హాని వంటి సమస్యలను కూడా పరిష్కరించాలని గగోరు మోడీకి రాసిన లేఖలో కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని గగోరు లేఖలో పేర్కొన్నారు.

➡️