Jharkhand : మంత్రిగా ఎమ్మెల్యే రామ్‌దాస్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం

రాంచీ :   జెఎంఎం ఎమ్మెల్యే రామదాస్‌ సోరెన్‌ శుక్రవారం జార్ఖండ్‌లోని హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్‌ స్థానంలో రామదాస్‌ సోరెన్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ రాందాస్‌ సోరెన్‌తో మంత్రిగా ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, జెఎంఎం నేతృత్వంలోని సీనియర్‌ నేతలు సహా పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.

చంపాయి సోరెన్‌ బుధవారం ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బిజెపిలో చేరనున్నట్లు సమాచారం.

➡️