ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనండి : ఓటర్లకు విజ్ఞప్తి చేసిన మోడీ

Feb 5,2025 11:42 #Delhi elections, #modi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు జరగనున్న ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు పాల్గొనాలని ప్రధాని మోడీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఈరోజు ఓటింగ్‌ జరగనుంది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని నేను ఓటర్లను కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న యువతీయువకులకు శుభాకాంక్షలు. ఫస్ట్‌ ఓట్‌ దెన్‌ రీఫ్రెష్‌మెంట్‌’ అని మోడీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

➡️