- మరో మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభం
న్యూఢిల్లీ : వికసిత భారత్ దిశగా తమ ప్రభుత్వం అడుగులేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న అనేక అంశాలను పరిష్కరిస్తూ రైల్వేలు ముందడుగు వేస్తున్నాయని ఆయన చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను శనివారం ఆయన ప్రారంభించారు. మీరట్-లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై, నాగర్‌కోయిల్‌ల మధ్య ఈ మూడు రైళ్లు ప్రయాణిస్తాయి. వికసిత భారత్‌కు ఆధునిక రైళ్ల వ్యవస్థ బలమైన మూల స్తంభం వంటిదని మోడీ అన్నారు. దక్షిణ భారతదేశంలో అపారమైన ప్రతిభ, అద్భుతమైన అవకాశాలు వున్నాయన్నారు. తమిళనాడుతో పాటూ మొత్తంగా దక్షిణ భారతాన్ని అభివృద్ధిపరచడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని మోడీ చెప్పారు.