ప్రధానిగా మోడి బాధ్యతలు – తొలి సంతకం ?

న్యూఢిల్లీ : ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడి సోమవారం సౌత్‌ బ్లాక్‌లోని పిఎం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. మరుసటి రోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. పిఎం కిసాన్‌ నిధిని విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు.

ప్రస్తుతం తన కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయింపుపై కేబినెట్‌ కార్యదర్శితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు తొలి కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తికానుంది. మోడి నేతృత్వంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోడి దిశానిర్ధేశం చేయనున్నారు. కొత్త మంత్రివర్గంలో 36 మంది గతంలో మంత్రులుగా చేసినవాళ్లుండగా.. 35 మంది కొత్తవాళ్లున్నారు. వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మోడి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 120 రోజుల కార్యాచరణ ప్రణాళికలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై ప్రధాని మోడి అధికారులతో చర్చించనున్నారు.

➡️