న్యాయస్థానాల్లో 5 వేలకు పైగా ఖాళీలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయస్థానాల్లో 5 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సబార్డినేట్‌, జిల్లా కోర్టులు 5,000 మందికి పైగా న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయాల్సివుందన్నారు. అలాగే 25 హైకోర్టుల్లో 360 కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో రెండు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాలు, హైకోర్టుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న కారణంగా.. అఖిల భారత న్యాయ సేవ (ఎఐజెఎస్‌) ఏర్పాటు ముందుకు సాగడం లేదని ఆయన తెలిపారు.

11 నెలల్లోనే 9 లక్షలపైగా కేసులు పెండింగ్‌

దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 11 నెలల్లో 9 లక్షలకు పైగా పెరిగిందని తెలిపారు. 2024 జనవరి 1 నాటికి వివిధ దిగువ కోర్టుల్లో 4.44 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా, ఇవి నవంబర్‌ 1 నాటికి 9.22 లక్షలకు పెరిగియాని తెలిపారు.

➡️