MP Kumari Shelja : రాహుల్‌, ప్రియాంకలు పార్టీకి కొత్త శక్తి

అంబాలా (హర్యానా) : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ ఎంపి కుమారి షెల్జా ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 5వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం అంబాలా, కురుక్షేత్రలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌, ప్రియాంకలు పాల్గొన్నారు. నేటితో వారి ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపి కుమారి షెల్జా మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము ఎన్నికల సందర్భంగా బాగా పనిచేశాం. ఈ రాష్ట్రంలో మేము గెలుస్తార. మాకు ఆ నమ్మకముంది. రాహుల్‌, ప్రియాంక గాంధీలు ఎక్కడి వెళ్లినా ప్రజలకు, పార్టీకి కొత్త శక్తి వస్తోంది’ అని ఆమె అన్నారు.
కాగా, అంబాలాలో కాంగ్రెస్‌ అభ్యర్థి పర్మిందర్‌ పరి తరపున షెల్జా ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగాకాంగ్రెస్‌ పార్టీ తరపున కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ హైకమాండ్‌ నిర్ణయిస్తుంది. మాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఓటర్లు మా పార్టీకి ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. అంబాలా గతంలో నేను పోటీ చేసిన నియోజకవర్గం. అందుకే ఈ ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చాను. మా మేనిఫెస్టోలు ఎప్పుడూ నిజాయితీగా ఉంటాయి. ఎప్పుడూ తప్పుడు వాగ్ధానాలు చేయము’ అని షెల్జా మీడియాకు వివరించారు.

➡️