అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం

Feb 3,2025 00:11 #Ayodhya, #Dalit woman, #rape

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బిజెపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళను దారుణగా హింసించి హత్యాచారం చేశారు. కాళ్లు విరిచి, కంటి గుడ్లు పెకలించిన 22 ఏళ్ల మహిళ నగ మృతదేహాన్ని కాలువలో గుర్తించారు. జిల్లాకు చెందిన 22 ఏళ్ల దళిత మహిళ జనవరి 30న రాత్రి వేళ భజన కార్యక్రమానికి వెళ్లి, అప్పటి నుంచి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఆమె మృతదేహాన్ని తాజాగా దారుణ స్థితిలో గుర్తించారు. మహిళ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుటుంభ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్‌ వచ్చిన తర్వాత ఏం జరిగిందో అన్నది నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్థానిక ఎంపి అవధేష్‌ ప్రసాద్‌ ఈ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ప్రెస్‌ మీట్‌లో ఆయన తీవ్రంగా విలపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు. ‘నన్ను ఢిల్లీకి వెళ్ళనివ్వండి. ప్రధాని మోడీ ముందు ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తుతా. న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా. కూతుళ్లను రక్షించడంలో మనం విఫలమవుతున్నాం. చరిత్ర మనల్ని ఎలా భావిస్తుంది?’ అంటూ బోరున విలపించారు.

➡️