కేజ్రీవాల్‌ పిఎస్‌కు జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు

ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి ఘటనలో కేజ్రీవాల్‌ పిఎస్‌ బిభవ్‌ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు పంపింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ పట్ల బిభవ్‌ కుమార్‌ అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

➡️