- ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్
ముంబయి : మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. మాఝీ లడ్కీ బెహన్ ఇన్‌కమ్ స్కీమ్ మద్దతు పథకంతో సిఎం మహిళలను మోసం చేస్తున్నారని అన్నారు. ఆదివారం మీడియాతో పవార్ మాట్లాడుతూ.. ఈ పథకానికి బడ్జెట్, నిధుల కేటాయింపులపై స్పష్టత లేదని అన్నారు. షిండే ప్రభుత్వం ఈ పథకానికి స్పష్టమైన, ప్రత్యేక నిధులను రూపొందించగలిగితే తమ పార్టీ వ్యతిరేకించదని అన్నారు. మహిళల భద్రత, రైతుల ఆందోళన, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడం తదితర మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎన్‌సిపిలోని పవార్ వర్గం, శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గం, కాంగ్రెస్‌లతో కూడిన ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) శ్వేతపత్రం విడుదల చేసింది.