మంత్రివర్గ పొందిక ఇలా..

Jun 10,2024 08:25 #NDA government, #with 72 members
  • ప్రధానిగా మోడీ
  • 30 మందికి కేబినెట్‌ హోదా
  • స్వతంత్ర హోదాలో ఐదుగురు
  • సహాయ మంత్రులుగా 36 మంది

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 72 మందితో కేంద్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. వీరిలో 30 మంది క్యాబినెట్‌, ఐదుగురు స్వతంత్ర, 36 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. మోడీతో పాటు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌ కూడా క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా ఐదేళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మోడీ కేబినెట్‌లో తొలిసారి అడుగపెట్టారు. అలాగే బిజెపి సీనియర్‌ నేతలు పీయూష్‌ గోయల్‌, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేంద్ర యాదవ్‌ వంటి నేతలు కేబినెట్‌లో తిరిగి చోటు దక్కించుకున్నారు. మొన్నటివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరు.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. అస్సాం మాజీ సిఎం సర్బానంద సోనోవాల్‌, అశ్వినీ వైష్ణవ్‌, వీరేంద్ర కుమార్‌, ప్రహ్లాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్‌, జుయల్‌ ఓరం వంటి బిజెపి నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మిత్రపక్షాల్లో ఐదుగురికే చోటు
సార్వత్రిక ఎన్నికల్లో సాధారణ మెజారీటి సాధించలేక చతికిలపడ్డ బిజెపిని ఈ దఫా ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాలే గట్టెక్కించాయి. అయినా మిత్ర పక్షాల్లో కేవలం ఐదుగురికి కేబినెట్‌లో బెర్తులు లభించాయి. జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామి, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌) అధినేత జితిన్‌ రాం మాంఝీ, జెడియు నేత లలన్‌ సింగ్‌, టిడిపి నుంచి కె.రామ్మోహన్‌ నాయుడు, ఎల్‌జెపి-ఆర్‌వి నేత చిరాగ్‌ పాశ్వన్‌ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ఐదు మిత్రపక్షాలకు ఒక్కో కేబినెట్‌ మంత్రి చొప్పున కేటాయించారు. వీరిలో కుమారస్వామి, జితిన్‌ రాం మాంఝీ మాజీ ముఖ్యుమంత్రులు.

కేబినెట్‌ మంత్రులు వీరే..
నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జెపి నడ్డా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జై శంకర్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, సర్బానంద సోనోవాల్‌, వీరేంద్ర కుమార్‌, ప్రహ్లాద్‌ జోషి, జుయల్‌ ఓరం, గిరిరాజ్‌ సింగ్‌, అశ్వనీ వైష్ణవ్‌, జ్యోతిరాదిత్య సింథియా, భూపేంద్ర యాదవ్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, అన్నపూర్ణాదేవి, కిరణ్‌ రిజిజు, హర్దీప్‌ సింగ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, కిషన్‌ రెడ్డి, ఇంద్రజీత్‌ సింగ్‌, జితేంద్ర సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, ప్రతాప్‌ రావ్‌ గణపత్‌ రావు జాదవ్‌, టిడిపి నేత రామ్మోహన్‌నాయుడు, జెడిఎస్‌ నేత కుమారస్వామి, జితన్‌ రాం మాంఝీ, జెడియు నేత లలన్‌ సింగ్‌, ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాసవాన్‌

సహాయ మంత్రులుగా ఎవ్వరంటే..
జయంత్‌ చౌదరి, జితిన్‌ ప్రసాద్‌, శ్రీపాద్‌ యశో నాయక్‌, పంకజ్‌ చౌదరి, క్రిషన్‌ పాల్‌, రాందాస్‌ అఠవలే, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, నిత్యానంద్‌ రారు, అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎస్పీ సింగ్‌ బఘేల్‌, శోభా కరంద్లాజే, కీర్తి వర్థన్‌ సింగ్‌, బిఎల్‌ వర్మ, శాంతను ఠాకూర్‌, సురేశ్‌ గోపి, ఎల్‌ మురుగన్‌, అజరు తంప్టా, బండి సంజరు, కమలేశ్‌ పాసవాన్‌, భగీరథ్‌ చౌదరి, సతీశ్‌ చంద్ర దూబె, సంజరు సేథ్‌, రవ్‌నీత్‌ సింగ్‌, దుర్గాదాస్‌ ఉయికె, రక్షా నిఖిల్‌ ఖడ్సే, సుఖాంత్‌ మజుందార్‌, సావిత్రి ఠాకూర్‌, తోకన్‌ సాహు, రాజ్‌ భూషణ్‌ చౌధరి, భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్‌ బంభానియా, మురళీధర్‌ మొహౌల్‌, జార్జ్‌ కురియన్‌, పబిత్ర మార్గెరెటా.

ఖర్గే మినహా ప్రతిపక్షాల నేతలు దూరం..


మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఆయన మినహా మిగిలిన ప్రతిపక్షాల నేతల్లో చాలా వరకు హాజరుకాలేదు. అయితే ఈ కార్యక్రమానికి వ్యాపార, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, అదానీ గ్రూపు సంస్థల అధిపతి గౌతమ్‌ అదానీ, సినీ నటులు షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌, అక్షరు కుమార్‌, రవీనా టండన్‌, అనుపమ్‌ ఖేర్‌, విక్రాంత్‌ మస్సే తదిరులు విచ్చేశారు. వీరితోపాటు అంబానీ కుమారులు అనంత్‌, ఆకాశ్‌, అల్లుడు ఆనంద్‌ పిరమల్‌ రాగా, అలాగే గౌతమ్‌ అదానీ భార్య ప్రీతి, సోదరుడు రాజేశ్‌ అదానీ హాజరయ్యారు.

పొరుగు దేశాధినేతల రాక


ఈ ప్రమాణస్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు పలువురు తరలివచ్చారు. బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా, మాల్దీవుల అధ్యక్షులు మొహ్మద్‌ ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షులు రణిల్‌ విక్రమసింఘే, నేపాల్‌ ప్రధానమంత్రి ప్రచండ, మారిషస్‌ ప్రధానమంత్రి ప్రవింద్‌ కుమార్‌ జుగ్‌నౌద్‌, భూటాన్‌ ప్రధానమంత్రి షెరింగ్‌ తోభ్గే, సీషెల్స్‌ ఉపాధ్యక్షులు అహ్మద్‌ ఆఫిఫ్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. మొత్తంగా దాదాపు 8 వేల మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️