న్యూఢిల్లీ : పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోసం నీట్ పిజి పరీక్షను ఈ నెలలో నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. రెండు గంటల ముందు ప్రశ్నాపత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించాయి. సైబర్‌క్రైమ్ వ్యతిరేక సంస్థ అధికారులు నేడు హోం మంత్రిత్వ శాఖతో భేటీ అయినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
నీట్ ప్రశ్నాపత్రాల లీక్, అక్రమాలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవడంతో షెడ్యూల్ ప్రకారం.. జూన్ 23న నిర్వహించాల్సిన నీట్ పిజి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదావేసిన సంగతి తెలిసిందే. వైద్య విద్యార్థుల కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే నీట్ పిజి పరీక్షల పటిష్టతను క్షుణ్ణంగా పరిశీలిస్తామని ప్రకటించింది.
