NEET Scam: నీట్‌ కేసుల బదిలీపై మీరేమంటారు?

విద్యార్థులకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : నీట్‌ పరీక్షలో అక్రమాలు, ప్రశ్నా పత్రాల లీకేజీలపై వివిధ హైకోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లనిుంటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాల్సిందిగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) అభ్యర్ధనపై స్పందనలు తెలియజేయాల్సిందిగా విద్యార్థులను సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు విద్యార్థులకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ సోమవారం నోటీసులు జారీ చేసింది. అధీకృత రూలింగ్‌ కోసం వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో వును కేసులను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్‌టిఎ కోరింది. తాజాగా నీట్‌ పరీక్ష నిర్వహించాలను డిమాండ్‌ నుండి ఎన్‌టిఎను రద్దు చేయాలను డిమాండ్‌ వరకు వివిధ డిమాండ్లపై మొత్తంగా 40 పిటిషన్లు వేర్వేరుగా దాఖలయ్యాయి. వాటిపై ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ నేతృత్వంలోనిజస్టిస్‌ పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన బెంచ్‌ విచారిస్తోంది. ఈ సందర్భంగా వాటినన్నింటినీ సుప్రీంకు బదిలీ చేయాలంటూ ఎన్‌టిఎ పిటిషన్‌ వేసింది. 18న నీట్‌ కేసును సుప్రీం విచారించాల్సి వుంది. తిరిగి పరీక్షను నిర్వహించాలా? వద్దా? అనేది సుప్రీం కోర్టు ముందును ప్రధానమైన ప్రశుగా వుంది. పరీక్ష రాసిన వాళ్లలో తప్పులు చేసినవారు వునాురా? లేదా? వుంటే వారిని అమాయకులైన విద్యార్ధుల నుండి వేరు చేయడానికే తమ మొదటి ప్రాధాన్యత అని కోర్టు ఇప్పటికే చెప్పింది. మే 5న నీట్‌ రాసిన 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినేలా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాలనుకోవడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

➡️