తమిళనాడులో ఎన్‌ఐఏ దాడులు – ఏకకాలంలో 27చోట్ల సోదాలు

Feb 10,2024 09:39 #27, #NIA raids, #places, #searches, #Tamil Nadu

చెన్నై : తమిళనాడులో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు, చెన్నై, తిరుచ్చి సహా 27 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఎనిమిది మండలాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాగా, 2019 కోయంబత్తూరు కారు పేలుడు కేసుకు సంబంధించి కీలమైన సమాచారం మేరకు ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. సోదాల్లో భాగంగా అధికారులు కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

➡️