భోపాల్ : హనుమాన్ జయంతి ఊరేగింపు ఉద్రిక్తతకు దారితీయడంతో ఇరువర్గాలు రాళ్లురువ్వుకున్నాయి. సిసి ఫుటేజీ ఆధారంగా ప్రధాన నిందితుడు వికీ పాంథన్ సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నామని గుణ అదనపు ఎస్‌పి ఆదివారం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా కల్నల్‌గంజ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని అన్నారు.
ఊరేగింపు మసీదు మీదుగా వెళుతుండగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగిందని, ఉద్రిక్తతకు దారితీయడంతో రాళ్లురువ్వుకున్నాయని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, భారీగా భద్రతా బలగాలను మోహరించామని అన్నారు. స్థానిక కార్పోరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురు వ్యక్తులు, సుమారు గుర్తుతెలియని 20 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అన్నారు. ఊరేగింపు కోసం ఎటువంటి అనుమతి తీసుకోలేదని అన్నారు.