కాలువలోకి దూసుకెళ్లిన జీపు – 9మంది మృతి

హర్యానా : జీపు కాలువలోకి దూసుకుపోవడంతో 9మంది మృతి చెందిన ఘోర ఘటన శుక్రవారం రాత్రి హర్యానాలోని ఫతేహాబాద్‌ జిల్లాలో జరిగింది. పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ జీపు సర్దారెవాలా గ్రామం సమీపంలో అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. దీంతో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. వివాహ వేడుక నుంచి 13 మందితో తిరుగు ప్రయాణం చేస్తున్న క్రూజర్‌ భాఖడా జీపు కాలువలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో ఇద్దరిని రక్షించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల చిన్నారి ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️