Budget : పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలుత రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ముతో సమావేశమైన సీతారామన్‌ బడ్జెట్‌ సమర్పణకు ఆమోదం తెలిపారు. అనంతరం కేంద్ర కేబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.  ది పవర్‌ ఆఫ్‌ రైజింగ్‌ మిడిల్‌ క్లాస్‌ పేరుతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశమంటే మట్టికాదోరు దేశమంటే మనుషులోరు అంటూ గురజాడ అప్పారావు సూక్తిని నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు.
వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.  మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

 

బడ్జెట్‌లో అంశాలు

  • 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
    – ప్రపంచ’ ఆహారగంప’ గా భారత్‌
    – కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ద్వారా 7.74 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు.
    – 6రంగాల్లో సమూల మార్పులు
    – ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక
    – వ్యవసాయంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ మా లక్ష్యం
    – 2024-25లో ఆర్థిక వృద్ధి అంచనా 6.4శాతం
    – ఆర్థిక వృద్ధి రేటు సాధదిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి.
    – పప్పుధాన్యాల కోసం ఆరుసంవత్సరాల ప్రణాళిక
    – ప్రయోగాత్మకంగా పది జిల్లాల్లో ప్రధానమంత్రి ధన్‌ధాన్య యోజన
    – కెసిసి ద్వారా రుణాలు రూ. 3 లక్షల నుండి 5 లక్షలకు పెంపు
  • ప్రపంచ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్
  • బీహార్‌లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు. మఖనా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ
  • వందశాతం స్కిల్డ్ లేబర్
  • ఎగుమతులు చేసే ఎంఎస్‌ఎంఇలకు రూ.20 కోట్ల వరకు రుణాలు

– ఎంఎస్‌ఎంఇ రుణ సదుపాయాలు  పెంపు- ఎంఎస్‌ఎంఇల పెట్టుబడి, టర్నోవర్‌లు 2-2.5 రెట్లు పెంపు

-45 శాతం ఎగుమతులు ఎంఎస్‌ఎంఇలవే.. ఎగుమతులు చేసే ఎంఎస్‌ఎంఇలకు రూ.20 కోట్ల వరకు రుణాలు

-గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్‌ను ప్రపంచ పరిణామాలు దెబ్బతీస్తున్నాయి.

-నేషనల్ మాన్యుఫాక్చరింగ్ బోర్డ్ ఏర్పాటు

-సబ్ కా వికాస్ కు వచ్చే ఐదేళ్లు సువర్ణావకాశం

-పత్తి ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక మిషన్

-అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు

-అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు

-పదేళ్లలో ఐఐటిల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు

-ఐఐటి పాట్నా విస్తరణకు నిర్ణయం

-విద్యారంగంలో ఎఐ వినియోగం

-ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు

– బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, బీహార్‌లో  నేషనల్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ

-ఈశాన్య రాష్ర్టాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహం

-రూ.30 వేలతో స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులు

-బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం

-స్టార్టప్‌లకు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్లకు పెంపు

-అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ కేన్సర్ సెంటర్లు

-కోటి మంది గిగా వర్కర్లకు ఆరోగ్య బీమా

-50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్

-అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు

-సంస్కరణలు అమలు చేసే రాష్ర్ట ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు

-50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు

-మూలధన వ్యయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు

-2028 వరకు జలజీవన్ మిషన్ పొడిగింపు- జలజీవన్ మిషన్‌తో గత ఐదేళ్లలో 15 కోట్ల ఇళ్లకు మంచినీరు

-అసోంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్

-పర్వత ప్రాంతాల్లో హెలిప్యాడ్స్ ఏర్పాటుకు చర్యలు

-రూ.25 వేల కోట్లతో మేరీటైమ్ అభివృద్ధి ఫండ్

-విద్యుత్ రంగంలో సంస్కరణలకు పెద్ద పీట

-విద్యుత్ సంస్కరణల కోసం రాష్ట్రాలకు జిఎస్‌డిపిలో 0.5 శాతం అప్పు

-స్కిల్లింగ్ కోసం 5 నేషనల్ సెంటర్స్

-‘క్లీస్ టెక్ ’ మాన్యుఫాక్చరింగ్‌కు ఊతం

-‘జీన్ బ్యాంక్’ ఏర్పాటు చేస్తున్నాం

-సోలార్ బ్యాటరీలు, ఇవి బ్యాటరీలు, విండ్ టర్బయిన్స్‌కు ఊతం

-క్లీన్ ఎనర్జీ దిశగా అణుశక్తి మిషన్

-2047 నాటికి 100 జిడబ్ల్యుల అణు విద్యుత్ ఉత్పాదనే లక్ష్యం

-ఈవి బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం క్లీన్ టెక్ మిషన్

-మరో 120 రూట్లలో ఊడాన్ పథకం

-పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు

-రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

-ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ఎఫ్‌డిఐలకు అనుమతి

-ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అనుమతి

 

–  వచ్చే వారం పార్లమెంట్ ముందుకు కొత్త   ఆదాయపు పన్ను బిల్లు – ఆదాయపు పన్నుల్లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగింపు

బిఎన్‌ఎస్ స్ఫూర్తితో కొత్త  ఆదాయపన్ను బిల్లు తీసుకొస్తాం. లిటిగేషన్లు తగ్గించేలా ఆదాయ పన్ను విధానం

మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగ పన్ను విధానం

టిడిఎస్‌పై మరింత క్లారిటీ – సీనియర్ సిటిజన్స్‌కు టిడిఎస్ మినహాయింపు రూ.50 వేల నుండి రూ.లక్షకు పెంపు

అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగింపు

అద్దె ఆదాయంపై టిడిఎస్ రూ.6 లక్షలకు పెంపు, వృద్ధులకు వచ్చే ఆదాయంపై టిడిఎస్ రూ.50 వేల నుండి రూ.లక్షకు పెంపు

రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు,

 

-2028 నాటికి గ్రామీణ భారతంలో అందరికీ మంచి నీరు

-ఐఐటి, ఐఐఎస్‌సిల్లో పరిశోధన చేసే పదివేల మందికి ఫెలోషిప్స్

-ఆహార భద్రత కోసం జీన్ బ్యాంక్ ఏర్పాటు

-స్వయం సహాయక గ్రూపులకు గ్రామీణ క్రెడిట్ కార్డులు

-6లైఫ్ సేవిండ్ మెడిసెన్స్‌పై పన్నులు తగ్గింపు -36 లైఫ్ సేవింగ్ మెడిసెన్స్‌పై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు

-గ్రోత్ హబ్‌గా నగరాలు

-అణు  ఇంధన మిషన్ – అణు  ఇంధన రంగంలో ప్రైవేట్‌కే

-విద్యుత్ రంగంలో రిఫార్మ్ తెస్తున్నాం

-2047 నాటికి కనీసం 100 గిగా వాట్ల అణు విద్యుత్

-82 అంశాలపై సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ ఎత్తివేత

నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను సమర్పించడం వరుసగా ఇది ఎనిమిదోసారి. అత్యధికంగా పదిసార్లు మొరార్జీ దేశారు బడ్జెట్‌ను సమర్పించగా, తొమ్మిదిసార్లు బడ్జెట్‌ను సమర్పించిన రికార్డు పి.చిదంబరం పేరు మీద ఉంది.

➡️