Budget 2025- 26 : కుంభమేళా విషాదంపై చర్చించాలని ప్రతిపక్షాల నిరసన

Feb 1,2025 11:30 #Budget

న్యూఢిల్లీ : నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో ఉదయం 11 గంటలకు 2025-26 సంవత్సరానికిగానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన సమయంలోనే ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా విషాదంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఘటనపై సమావేశాల్లో చర్చించాలని సమాజ్‌వాదీ పార్టీ సహా పలు పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో సభ్యులు సమయమనం పాటించాలని స్పీకర్‌ ఓంబిర్లా సూచించారు. ప్రస్తుతం నిర్మలమ్మ ప్రసంగం కొనసాగుతోంది.

➡️