భారత్‌ అమ్ములపొదిలో అణు మిసైల్‌

న్యూఢిల్లీ : భారత రక్షణ రంగంలో అత్యంత కీలమైన అణు మిసైల్‌ణు బుధవారం భారత నేవీ పరీక్షించింది. 3,500 కిలోమీటర్ల దూరాన్ని చేధించగల కె-4 బాలిస్టిక్‌ మిసైల్‌ను నేవీలో కొత్తగా ప్రవేశపెట్టిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘాట్‌ నుండి ప్రయోగించింది. ప్రయోగం విజయవంతమవడంతో దేశ అణుసామర్థ్య ఆయుధాల వాడకంలో మరింత పురోగతి సాధించినట్లు నేవీ అధికారులు ప్రకటించారు.

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌, అరిఘాట్‌ భారత నౌకాదళంలో కీలకమైన అణు జలాంతర్గాములు. ఇవి బాలిస్టిక్‌ మిసైల్స్‌ను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అరిఘాట్‌ను ఈ ఏడాది ఆగస్టులో విశాఖపట్నంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో ప్రారంభించారు.

➡️