ఒడిషా సిఎంగా మోహన్‌ చరణ్‌ మాంఝీ – నేడు ప్రమాణస్వీకారం

Jun 12,2024 10:04 #CM Mohan Charan Manjhi, #Odisha

భువనేశ్వర్‌ : ఫలితాలు వెల్లడైన వారం రోజుల తరువాత ఒడిషా సిఎంగా మోహన్‌ చరణ్‌ మాంఝీని నియమించాలని బిజెపి నిర్ణయించింది. భువనేశ్వర్‌లోని బిజెపి కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు. గత అసెంబ్లీలో బిజెపి చీఫ్‌ విఫ్‌గా ఉన్న మాంఝీ ఇప్పటివరకూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉప ముఖ్యమంత్రులుగా పాట్నాగఢ్‌ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కెవి సింగ్‌ డియో, నిమపర నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రావిత పరిడాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, భూపేంద్ర యాదవ్‌ కేంద్ర పరిశీలకులుగా పాల్గన్నారు. మాంఝీ బుధవారం సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జనతా మైదానంలో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ పాల్గననున్నారు.

➡️