మణిపూర్‌లో ఆగని హింసాకాండ

ఇంఫాల్‌/న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మణిపూర్‌లోని జిర్‌బమ్‌ జిల్లాలో కొందరు అనుమానిత తిరుగుబాటుదారులు దుండగులు పోలీస్‌ స్థావరాలపై దాడిచేయడంతో పాటు కొన్ని నివాసాలకు నిప్పు పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జిర్‌బమ్‌ జిల్లా పక్కనే ఉన్న బరాక్‌ నది నుండి మూడు నాలుగు బోట్లలో తిరుగుబాటుదారులు వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం అర్థరాత్రి 12.30గంటల సమయంలో జిర్‌బమ్‌లోని ఛోటోబక్రాలోని దాడి ప్రారంభమైనట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. మొదట ఛోటోబక్రా పోలీస్‌ స్థావరంపై దాడి జరిగిందని, అనంతరం లాంటైఖునౌ, మోధుపూర్‌లలోని పోలీస్‌ స్థావరాలపై తిరుగుబాటుదారులు దాడి చేసినట్లు వెల్లడించారు. ఛోటోబక్రాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరోబక్రాలోని పోలీస్‌ స్థావరంపై 2.30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్లు మరో పోలీస్‌ అధికారి తెలిపారు. అనుమానిత తిరుగుబాటుదారులు నది ఒడ్డున ఉన్న అనేక గ్రామాలపై కూడా దాడి చేసినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. గ్రామాల్లోని పలు నివాసాలకు దుండగులు నిప్పుపెట్టిన అనంతరం డ్యాన్సులు చేస్తున్న దశ్యాలు మీడియాలో కనిపించాయని అన్నారు. జిర్‌బమ్‌ పట్టణ శివారుల్లో నివసిస్తున్న 250 మంది మొయితీలను అస్సాం రైఫిల్స్‌ శుక్రవారం తరలించింది. గురువారం ఈ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల వ్యక్తిని కుకీ తిరుగుబాటుదారులు హత్య చేశారంటూ మొయితీ కమ్యూనిటీ ఆరోపించింది. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ మొయితీలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలువురిని ఇక్కడి నుండి తరలించినట్లు అస్సాం రైఫిల్స్‌ పేర్కొన్నాయి.

జిర్‌బమ్‌ పట్టణ శివారుల్లో నివసిస్తున్న 250 మంది మొయితీలను అస్సాం రైఫిల్స్‌ శుక్రవారం తరలించింది. గురువారం  ఈ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల వ్యక్తిని కుకీ తిరుగుబాటుదారులు హత్య చేశారంటూ  మొయితీ కమ్యూనిటీ  ఆరోపించింది.  దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ మొయితీలు శుక్రవారం ఆందోళన చేపట్టారు.  తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలువురిని  ఇక్కడి నుండి తరలించినట్లు  అస్సాం రైఫిల్స్‌   పేర్కొన్నాయి.

➡️