న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల నుండి శనివారం ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్‌ను కేంద్రం ఆమోదించకపోవడంతో లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి. జనవరి 29న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 30 మంది మరణించగా, 60 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
