బిజెపికి 370కి పైగా స్థానాలు – మోడీ జోస్యం

Feb 12,2024 11:08 #PM Modi
Over 370 seats for BJP - Modi's prediction

ఝబువా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపియే విజయం సాధిస్తుందని, 370కి పైగా స్థానాల్లో గెలుపొందుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభ కార్యాక్రమాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝబువా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో కనీసం 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని, 370 స్థానాలకు పైగా బిజెపి అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌.. 2024లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల సమయం వస్తేనే ఆ పార్టీకి గ్రామాలు, పేదలు, రైతులు గుర్తుకొస్తాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ నినాదం ‘దోచుకోవడం, విభజించడం’ అని ఆయన పేర్కొన్నారు. 13, 14 తేదీల్లో యుఎఇ పర్యటనప్రధాని మోడీ ఈ నెల 13, 14 తేదీల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)లో పర్యటించనున్నారు. తొలి రోజు ఆయన యుఎఇ అధ్యక్షులు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్వాన్‌తో సమావేశం కానున్నారు. అలాగే రాజధాని నగరమైన అబుధాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని మోడీ ప్రారంభిస్తారు.

➡️